తెలుగు రాష్ట్రాల్లో70 కోట్ల షేర్‌

Monday, April 9th, 2018, 08:27:32 PM IST

ఏ నోట విన్నా `రంగ‌స్థ‌లం` రికార్డుల గురించే. ఈ సినిమా ఇప్ప‌టికే టాలీవుడ్‌లో నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో టాప్ -5 పొజిష‌న్‌కు చేరుకుంది. ఓవ‌ర్సీస్‌లో టాప్‌-3 పొజిష‌న్‌ని అందుకుంది. అయితే ఈ సినిమా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంత వ‌సూలు చేసింది? అంటే ఏరియా వైజ్ లెక్క‌లు ఇలా ఉన్నాయి. `రంగ‌స్థ‌లం` జస్ట్‌ 10 రోజుల్లో సుమారు 70 కోట్ల షేర్ వ‌సూళ్ల‌తో ఏపీ, నైజాంలో కుమ్మేసింది. ఇక ఓవ‌ర్సీస్ షేర్ క‌లుపుకుని 90 కోట్ల‌కు చేరుకుంది. అంటే ఖైదీనంబ‌ర్ 150 సాధించిన 100 కోట్ల షేర్‌కు చేరేందుకు ఇంకో వారం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఆంధ్రా బాక్సాఫీస్ అందించిన షేర్‌ లెక్క‌లివి… .

నైజాం -19.62కోట్లు, సీడెడ్ -13.05 కోట్లు, వైజాగ్‌-9.53కోట్లు, తూ.గో జిల్లా-5.85 కోట్లు, ప‌.గో.జిల్లా -4.60 కోట్లు, కృష్ణ‌- 5.40 కోట్లు, గుంటూరు-6.75కోట్లు, నెల్లూరు- 2.46కోట్లు, ఏపీ, నైజాం ఓవ‌రాల్‌గా 67.26కోట్లు వ‌సూలు చేసింది. మూడోవారంలో 100 కోట్ల షేర్‌, 150 కోట్ల గ్రాస్ ను చేరుకునే ఛాన్సుంద‌ని అంచ‌నాలున్నాయి. అయితే ఈనెల 12న వ‌స్తున్న నాని `కృష్ణార్జున యుద్ధం` రిపోర్ట్ కూడా ఈ వ‌సూళ్ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments