రివ్యూ రాజా తీన్‌మార్ : రంగుల రాట్నం – సీరియల్ కి ఎక్కువ, సినిమాకి తక్కువ

Sunday, January 14th, 2018, 06:21:01 PM IST

తెరపై కనిపించిన వారు : రాజ్ తరుణ్, చిత్రా శుక్ల

కెప్టెన్ ఆఫ్ ‘రంగుల రాట్నం’ : శ్రీరంజని

మూల కథ :

విష్ణు (రాజ్ తరుణ్) ఏదో ఉద్యోగం చేసుకుంటూ, తన తల్లి(సితార) తో కలిసి సంతోషంగా కాలం గడిపే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని తల్లి మాత్రం అతన్ని త్వరగా పెళ్లి చేసుకోమని తొందరపెడుతూ సంబంధాలు చూస్తుంటుంది.

అలాంటి సమయంలోనే అతను కీర్తి (చిత్రా శుక్ల)ని ప్రేమిస్తాడు. అమ్మాయి కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత విష్ణు, కీర్తి ప్రేమను తట్టుకోలేక ఆమెకు దూరం జరుగుతాడు. అలా విష్ణు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమను ఎందుకు కాదంటాడు ? మళ్ళీ వాళ్లిద్దరూ కలిశారా లేదా ? అనేదే సినిమా.

విజిల్ పోడు :

–>సినిమాలో తల్లీకొడుకుల సెంటిమెంట్ కు సంబదించిన కొన్ని సీన్స్ బాగున్నాయి. తల్లిగా సితార బాగానే నటించింది. ఈ రెండు అంశలకి మొదటి విజిల్ వేయాలి.

–> కమెడియన్ ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించి సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. కాబట్టి అతనికి మొదటి విజిల్ వేయొచ్చు.

–> ద్వితీయార్థంలో హీరో హీరోయిన్ ఓవర్ కెరిబిన్గ్ తట్టుకోలేకపోవడం, ఆమెను దూరం పెట్టడం, వాళ్లిద్దరూ కలిసే క్లైమాక్స్ సీన్ పర్వాలేదు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> తల్లీ కొడుకుల సెంటిమెంట్ కొంత మేర బాగానే ఉన్నా ఒకానొక దశలో మరీ ఓవర్ గా మారిపోయి మొహమాటాన్ని కలిగిస్తుంది. వాళ్ళ ట్రాక్ రిపీటెడ్ సన్నివేశాలతో సీరియల్ సాగినట్టు సాగుతూ బోర్ కొట్టించింది.

–> ఫస్టాఫ్ అంతా రొటీన్ గా, ఒక గమ్యం లేకుండా నడిచిన సినిమా సెకండాఫ్ లో కూడా చాలా వరకు అలానే నడిచి విసిగించింది.

–> హీరో హీరోయిన్ల మధ్యన లవ్ ట్రాక్ అస్సలు బాగోలేదు. ఏ కోశానా ఇద్దరూ ప్రేమికుల్లానే అనిపించరు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ సినిమాలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన సన్నివేశాలు, అంశాలు లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఏంట్రా బాబు ఇది సినిమానా.. సీరియలా ?
మిస్టర్ బి : సీరియల్ కి ఎక్కువ, సినిమాకి తక్కువ అనేలా ఉంది.
మిస్టర్ ఏ : ఏ ఒక్క ఎమోషనూ సరిగా పండలేదు.