లేటెస్ట్ అప్డేట్: కేజిఎఫ్ చాప్టర్ 2 లో ప్రముఖ టాలీవుడ్ నటుడు!

Monday, February 10th, 2020, 12:39:40 PM IST

కేజిఎఫ్ చిత్రం తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, కేజిఎఫ్ చాప్టర్ 2 తో ప్రపంచానికి ఇండియా సినిమా అంటే ఇది అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత సౌత్ లో అంతగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం కేజిఎఫ్. అయితే ఈ చిత్రంకోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ చాల శ్రమిస్తున్నారు. షూటింగ్ చాల వేగవంతం చేసాడు. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ తారలు సైతం జాయిన్ అయినా విషయం అందరికీ తెలిసిందే.

అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 లో తెలుగు విలక్షణ నటుడు రావు రమేష్ నటించబోతున్నారు. ఈ విషయాన్నీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు. రావు రమేష్ నటనకు తెలుగులో విపరీతమైన అభిమానులు వున్నారు. ఎలాంటి హీరో చిత్రంలో అయినా సులువుగా పాత్రలో ఒదిగిపోయే నటుడు అలాంటి రావు రమేష్ కేజిఎఫ్ చాప్టర్ 2 లో నటించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజిఎఫ్ తో మ్యాజిక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ చాప్టర్ 2 లో మాఫియా ని ప్రపంచస్థాయిలో చూపించబోతున్నారు. కన్నడలో మాత్రమే కాకుండా, సౌత్, నార్త్ అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఏంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.