కాస్టింగ్ కౌచ్ పై రష్మీ సంచలన కామెంట్స్ ?

Friday, May 11th, 2018, 11:19:33 PM IST


ప్రస్తుతం సినిమా పరిశ్రమలో సంచలనం రేపుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై ఈ మధ్య పలువురు హీరోయిన్స్ బాహాటంగా తమ అనుభవాలు, అభిప్రాయాలూ చెప్పడంతో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేగుతుంది. మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో చర్యలు తీసుకునేందుకు ఫిలిం ఛాంబర్ ఓ కమిటీని నియమించింది. తాజాగా ఈ విషయం పై గ్లామర్ యాంకర్ గా ఇమేజ్ తెచ్చుకున్న రష్మీ గౌతమ్ స్పందించింది. మహిళల పై జరుగుతున్నా లైంగిక వేధింపులు ఒక్క సినిమా పరిశ్రమలోనే జరగడం లేదని, కాస్టింగ్ కౌచ్ పై చర్చ రాగానే అందరు సినిమా పరిశ్రమను లక్ష్యంగా అనుకుంటున్నారని, బయట అన్ని రంగాల్లో మహిళలపై వేధింపులు ఉన్నాయని చెప్పింది. ఈ విషయం గురించి చౌకబారు మాటలు మాట్లాడడం కన్నా .. ఈ విషయాలు జరగకుండా ప్రయత్నాలు చేయాలనీ ట్విట్టర్ లో స్పందించింది.

Comments