విజయ్ తో డేటింగ్ గురించి కుండబద్దలు కొట్టిన రష్మిక – విజయ్ కి సీన్ లేదు

Tuesday, July 23rd, 2019, 07:43:20 PM IST

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకి, హీరోయిన్ రష్మికకు మధ్య ఎదో పెద్ద ఎపిసోడ్ నడుస్తుందంటూ చాలా రోజుల నుండి అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటానికి కూడా విజయ్ తో ఉన్న రిలేషన్ కారణమనే పుకార్లు కూడా గట్టిగానే వినవచ్చాయి. రష్మిక తో ఉన్న బంధంతోనే విజయ్ దేవరకొండ తన డియర్ కామ్రేడ్ సినిమాలో ఆమెని తీసుకున్నాడని కొన్ని కధనాలు రావటం జరిగాయి.

తాజాగా ఆ సినిమా ప్రొమోషన్ లో భాగం రష్మిక మాట్లాడుతూ అలాంటి వాదనలో నిజం లేదు. ఈ సినిమాకి విజయ్ నన్ను రిఫర్ చేశాడు అనేది అబద్దం, విజయ్ కి అంత సీన్ లేదు. ఈ సినిమా స్టోరీ నచ్చి, అందులో నా పాత్ర నచ్చింది కాబట్టే ఈ సినిమా చేశాను. ఈ సినిమా స్టోరీ నాకు భరత్ పంపిస్తే ఎక్కడ ఆగకుండా స్టోరీ మొత్తం చదివాను, అంత బాగా నచ్చింది నాకు అందుకే చేశాను తప్పితే, ఇందులో విజయ్ ఇన్వెల్మెంట్ ఏమి లేదని చెప్పుకొచ్చింది.

అలాగే డేటింగ్ గురించి మాట్లాడుతూ నాకు ఉదయం నుండి సాయంత్రం దాక సినిమా షూటింగ్, ఆ తర్వాత జిమ్ కి వెళ్లివచ్చేసరికి రాత్రి అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 కి షూటింగ్ ఉంటుంది, ఇక డేటింగ్ చేసే టైం ఎక్కడ ఉంటుంది బాబు, ఒక్కోసారి తినటానికి కూడా టైం దొరకటం లేదంటూ తన మీద వస్తున్నా రూమర్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేసింది.