గీత గోవిందం మూవీ తెర వెనుక జ‌రిగిన రియ‌ల్ స్టోరీ.. బోరున ఏడ్చేసిన ర‌ష్మిక.. కార‌ణం అత‌డే..!

Tuesday, October 9th, 2018, 12:05:01 PM IST

తెలుగు వెండితెర పై ఒక్క‌సారిగా దూసుకువ‌చ్చింది క‌న్న‌డ భామ ర‌ష్మిక మందాన‌. చ‌లో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ భామ‌.. న‌టించిన తొలి చిత్రంలోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్ర‌మంలో త‌ను న‌టించిన రెండ‌వ చిత్రం ఏకంగా భారీ విజ‌యాన్ని న‌మోదుచేసుకుంది. టాలీవుడ్ మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ ప‌ర‌సురాం ద‌ర్శ‌క‌త్వంలో.. రౌడీ స్టార్ విజ‌య దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన గీత గోవిందం ఏకంగా వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. చిన్న చిత్రంగా విడ‌ద‌ల అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

అయితే ఇక్క‌డ అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. గీతా గోవిదం చిత్రంలో ఎక్కువ భాగం విజ‌య దేవ‌ర కొండ‌ని ర‌ష్మిక ఆడుకున్నసంగ‌తి తెలిసిందే. వెండితెర పై రౌడీ స్టార్‌ని ర‌ఫ్ఫాడించిన ర‌ష్మిక‌ను తెర‌వెనుక ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌రసురాం ఓ ఆట ఆడుకున్నాడ‌ట‌. రష్మిక ఒక‌రోజు షూటింగ్‌కు లేట్‌గా వ‌చ్చింద‌ట‌… దీంతో ఆమెతో అప్పుడు సెట్‌లో ఉన్న వాళ్ళు ఎవ‌రూ మాట్లాడ‌లేద‌ట‌. ఎవ‌ర్ని ప‌ల‌క‌రించినా ముఖం తిప్పేసుకుంటున్నార‌ట‌. దీంతో ప‌క్క‌కు వెళ్ళి ర‌ష్మిక బోరున ఏడ్చేసింద‌ట‌.. దీంతో వెంటనే ప‌రిగెత్తుకుంటూ వెళ్ళి ద‌ర్శ‌కుడు ప‌ర‌సురాం.. త‌న‌ను ఊరికే ఆట‌ప‌ట్టించ‌డానికి ఇలా చేశామ‌ని.. కావాలంటే త‌న‌దగ్గ‌ర ఉన్న కెమేరాను ఒక‌సారి చూడ‌మ‌ని.. త‌న‌కు తెలియ‌కుండా ఫాలో అవుతున్న కెమేరాను చూపించాడ‌ట‌. దీంతో తేరుకున్న ర‌ష్మిక అక్క‌డ ఉన్న ఒక చిన్న క‌ర్ర తీసుకుని ప‌ర‌సురాంను కొట్ట‌డానికి అత‌ని వెనుక ప‌రిగెత్తింద‌ట‌. దీంతో ఆరోజు సెట్లో చాలా ఫ‌న్నీగా గ‌డిచిపోయింద‌ని చెప్పింది రష్మిక‌.