100 మిలియన్ కొట్టిన మాస్ మహారాజ్..!

Monday, July 13th, 2020, 04:01:10 PM IST

తన స్వశక్తి తో టాలీవుడ్ లో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక స్టార్డం ను తెచ్చుకున్న హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒకరు. మన టాలీవుడ్ లోనే జీరో పర్సెంట్ హేటర్స్ ఉన్న ఇద్దరు హీరోల్లో రవితేజ ఒకరు.

కానీ మాస్ మహారాజ్ రవితేజకు ఇప్పుడు సరైన హిట్ లేదు. అలా తనకు హిట్స్ లేని సమయంలో అతి పెద్ద హిట్ ఇచ్చిన చిత్రం “రాజా ది గ్రేట్”. ఈ సినిమా ఆడియో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా ఓ ప్రయివేట్ సాంగ్ ను ఈ చిత్రంలో రీమిక్స్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

థియేటర్స్ లో ఈ ట్రైలర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే సాంగ్ యూట్యూబ్ లో కూడా అంతే పెద్ద హిట్టయ్యింది. ఆ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసి మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం రవితేజ హీరోగా తన హిట్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో “క్రాక్” అనే సినిమాలో మా నటిస్తున్నారు.

Click here for Gunna Gunna Mamidi Song