ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ మొదలు కాకపోవడానికి కారణం ఇదేనా!?

Friday, July 10th, 2020, 02:41:47 AM IST


దర్శక ధీరుడు రాజమౌళి తెరకక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం చిత్రం అన్ని సినిమాల చిత్రీకరణ లాగానే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆగిపోయింది. షూటింగ్ పునః ప్రారంభం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ మేరకు ఆయా సినిమాల చిత్రికరణ మళ్లీ పునః ప్రారంభం అయింది. అయితే రాజమౌళి సినిమా ఇంకా షూటింగ్ మొదలు కాకపోవడంతో అందరూ అందుకు గల కారణాలు ఏమై ఉంటాయి అని ఆలోచనలో ఉన్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం సినిమాల చిత్రీకరణ కి కేవలం 30 నుండి 50 మంది మాత్రమే ఉండాలి అని షరతు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి సినిమా కి కనీస 200 మంది అయినా సెట్ లో ఉండాల్సిందే. భారీ బడ్జెట్ చిత్రం కావడం తో ఇంకా ఎక్కువ మంది కలిసి పని చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వ్యాప్తి ఉన్న ఇలాంటి సమయం లో షూటింగ్ వాయిదా వేయడం సరైన నిర్ణయం అని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.