త‌మ‌న్నా ఐటెమ్ సాంగులు ఎందుకు చేస్తుందంటే?

Monday, September 26th, 2016, 02:45:42 PM IST

tammannah
ఈమ‌ధ్య స్టార్ క‌థానాయిక‌లు కూడా ఐటెమ్ సాంగులు చేసేస్తున్నారు. తెలుగులో ఒక‌ప్పుడు ఈ ప‌రిస్థితి ఉండేది కాదు. ఐటెమ్ అన‌గానే సెకెండ‌రీ గ్రేడ్ హీరోయిన్లే గుర్తుకొచ్చేవాళ్లు. అయితే ఈమ‌ధ్య మాత్రం స్టార్ హీరోయిన్లే పోటీప‌డుతున్నారు. క‌ళ్లు చెదిరే పారితోషికం వ‌స్తున్న‌ప్పుడు ఎవ‌రుమాత్రం ఆ ఛాన్స్‌ని వ‌దులుకొంటారు. ఎంత‌పెద్ద హీరోయిన్‌తో ఐటెమ్ పాట చేయిస్తే, అంత క్రేజ్ వ‌స్తున్న ప‌రిస్థితి ఉండ‌టంతో హీరోయిన్లు కూడా బాగా క్యాష్ చేసుకొంటున్నారు. ఐటెమ్ పాట‌ల విష‌యంలోత‌మ‌న్నా ముందు వ‌ర‌స‌లో ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో రెండుసార్లు ఐటెమ్ పాట‌లు చేసిందామె. ఇటీవ‌ల `జాగ్వార్‌`లోనూ ఆడిపాడింది. డ‌బ్బు కోస‌మే ఐటెమ్ పాట‌లు చేయ‌డానికి ఒప్పుకొంటారా? అని అడిగితే త‌మ‌న్నా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానమిచ్చింది. `నేను రెమ్యున‌రేష‌న్ ఎప్పుడూ ఎక్కువ‌గానే తీసుకొంటా. కానీ నేను ఐటెమ్ పాట‌లు చేస్తున్న‌ది మాత్రం అందుకు కాదు. న‌న్ను, నా డ్యాన్స్‌ను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తుంటారు. ఓ మంచి పాట‌కి డ్యాన్స్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు నేను మాత్రం ఎందుకు కాద‌నుకొంటాను“ అని చెప్పుకొచ్చింది.