అరవింద సమేత విజ‌యానికి.. అస‌లైన కార‌ణాలు ఇవే.. డోంట్ మిస్ – త‌ప్ప‌కుండా చ‌ద‌వాల్సిన మ్యాట‌ర్..!

Thursday, October 11th, 2018, 08:09:42 PM IST

అరవింద సమేత వీర రాఘవ భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. పబ్లిక్ ట‌క్‌లు అన్నీ పాజిటీవ్‌లు రాగా, రివ్యూలు కూడా ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాయి. దీంతో ఈ చిత్ర యూనిట్‌తో పాటు నంద‌మూరి అభిమానులు కూడా సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే అర‌వింద స‌మేత విజ‌యాకి గ‌ల కార‌ణాలు ఒక‌సారి స‌మీక్షిద్దాం.

ఈ చిత్ర విజ‌యంలో ఫ‌స్ట్ ప్లేస్ ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంది. ఎన్టీఆర్ ప‌క్కా మాస్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ విశ్వ‌రూప‌మే చూపించారు. స‌రైన స్క్రిప్టు ప‌డితే త‌న స‌త్తా ఎలా ఉంటుందో ఈ చిత్రంలో ఎన్టీఆర్ చూపించాడు. త్రివిక్ర‌మ్ క‌లం నుండి వ‌చ్చిన డైలాగులు ఎన్టీఆర్ ప‌లుకుతుంటే.. థియేట‌ర్ మొత్తం హోరెత్తిప‌దోయింది. ఇక‌ ఈ చిత్రంతో ఎన్టీఆర్ మాస్ ఆడియ‌న్స్‌తో పాటు.. వీర‌రాఘ‌వుడిగా సిక్స్ ప్యాక్‌లో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికీ పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త్రివిక్ర‌మ్ స్థానం ఏంటో అంద‌రికీ తెలుసు.. ర‌చ‌యిత‌గానూ, ద‌ర్శ‌కుడిగానూ త్రివిక్ర‌మ్ రేంజే వేరు. ఇటీవ‌ల అజ్ఞాతవాసితో ఫ‌స్ట్ టైమ్ ప్లాప్ వ‌చ్చినా త్రివిక్ర‌మ్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌లేము. ఎందుకంటే అత‌ని క‌లం బ‌లం అలాంటిది. ఈ అర‌వింద స‌మేత చిత్రం కూడా క‌థా బ‌లం ఉన్న చిత్ర‌మే. ఫ్యాక్ష‌నిజానికి మ‌రో కోణాన్ని చూపించి.. త‌న పెన్ను ప‌వ‌వ్ ఏంటో చూపించాడు త్రివిక్ర‌మ్. చాలా సున్నిత‌మైన మాట‌లు కూడా ఎన్టీఆర్‌తో సింపుల్‌గా చెప్పి ప్రేక్ష‌కుల చేత చ‌ప్ప‌ట్లు కొట్టించాడు. దీంతో ఈ చిత్రం మొద‌టి షో నుండే హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ చిత్రంలో సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ గురించి చెప్పుకోవాలి. త్రివిక్ర‌మ్ చిత్రానికి తొలిసారి మ్యూజిక్ కంపోజ్ చేసిన.. అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇక త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. ఈ చిత్రంలో కొన్ని సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయంటే అది త‌మ‌న్ ఆర్ ఆర్ మ‌హిమే.. ఇక పెనిమిటి పాట ఎలా సెన్షేష‌న్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఇక ఈ చిత్రంలో పూజా హ‌గ్డె గురించి కూడా చెప్పుకోవాలి. ఈ మూవీలో లీడ్ హీరోయిన్‌గా కీ రోల్ ప్లే చేసింది పూజా. త‌న సొంత డ‌బ్బింగ్‌తో త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చ‌సింది పూజ‌.

ఇక మ‌రో విష‌యం ఏంటంటే ఈ చిత్రంలో క‌మెడియ‌న్ సునీల్ కూడా ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించడం ఈ చిత్రానికి చాలా ప్ల‌స్ అయ్యింది. త‌న‌కు ఇచ్చిన పాత్ర‌లో సునీల్ న్యాయం చేశాడు.ఇక జ‌గ‌ప‌తిబాబు అయితే ఈ చిత్రంలో విల‌నిజాన్ని మ‌రో మెట్టుకు తీసుకుపోవ‌డ‌మే కాకుండా, త‌ను కూడా ఇంకో మెట్టు ఎక్కేసాడు. ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే సినిమా పై నిర్మాత రాధాకృష్ణ‌కు ఉన్న అవ‌గాహ‌న‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్, పీఎస్ వినోథ్ ఫొటోగ్ర‌ఫీ, న‌వీన్ నూలీ ఎడిటింగ్, ఏఎస్ ప్ర‌కాష్ ఆర్ట్స్, రామ్- ల‌క్ష‌న్ ఫైట్స్ ఈ చిత్ర విజ‌యంలో కీల‌క పాత్రాలు పోషించాయి.