రికార్డులు పగిలే అప్డేట్ “కేజీయఫ్ 2” ఫస్ట్ లుక్ వస్తుంది!

Saturday, December 14th, 2019, 11:03:42 AM IST

ఇప్పుడు యావత్ భారతదేశం మరోసారి ఏదన్నా సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” అని చెప్పాలి.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చాప్టర్ 1 ఊహలకు మించిన హిట్ గా నిలవడంతో చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం అయితే ముమ్మాటికీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయి వసూళ్లు రాబట్టడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఈ సినిమాకు సంబంధించి సరైన అప్డేట్ ఏది కూడా ఇవ్వకపోవడంతో ఈ సినిమా కల్ట్ ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉన్నారు.

అలాగే ఈ చిత్రంతో హీరో యష్ కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది.ఇలా చాప్టర్ 2పై మాత్రం అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఇలా ఎప్పటి నుంచో ఓ సరైన అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ ఓ రికార్డ్ బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమా తాలుకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ డిసెంబర్ 21 సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విడుదల కాబోతుంది అని అధికారికంగా ప్రకటన ఇచ్చారు.మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసమే ఎంతో మంది మాస్ ఆడియెన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ పోస్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి.