రెజీనా ద‌గ్గ‌ర పెద్ద లిస్టే ఉందండోయ్‌!

Monday, September 19th, 2016, 12:21:41 AM IST

regina
హీరోయిన్ల‌కి త‌ర‌చుగా ఎదుర‌య్యే అతి క్లిష్ట‌మైన ప్ర‌శ్నలేంటో తెలుసా? మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎవ‌రితో క‌లిసి సినిమా చేయాల‌నుంది? అనేవి. ఆ కొశెన్లు అడ‌గ్గానే హీరోయిన్లు త‌ల‌కేసి కొట్టుకొంటుంటారు. అస‌లు సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేదే వీలైనంత‌మంది క‌థానాయ‌కుల‌తో క‌లిసి న‌టించాల‌ని. మ‌రి ప్ర‌త్యేకంగా ఏ హీరో ఇష్టం? ఎవ‌రితో క‌లిసి న‌టించాల‌నుందని అడిగితే వాళ్లు మాత్రం ఏమ‌ని ఆన్స‌ర్ ఇస్తారు? నిజంగా ఎవ‌రిపైనైనా ప్ర‌త్యేక‌మైన ఇష్ట‌మున్నప్ప‌టికీ వాళ్ల ఒక్క‌రి పేరు
చెబితే ఇంకొక‌రు ఏమ‌నుకొంటారో అనే అనే భ‌యం వెంటాడుతుంటుంది. అందుకే ఆ ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం చెప్ప‌కుండా దాటేస్తూ సింపుల్‌గా త‌ప్పించుకొంటుంటారు హీరోయిన్లు. ఇటీవ‌ల రెజీనాకీ ఓ టీవీ షోలో ఆ ప్ర‌శ్నలు ఎదుర‌య్యాయి. ఆమె సాయిధ‌ర‌మ్ తేజ్ పేరో, సందీప్‌కిష‌న్ పేరో చెబుతుంద‌ని ఊహించారంతా. కానీ రెజీనా మాత్రం యంగ్ హీరోల జోలికి వెళితే ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని భావించి, సీనియ‌ర్ హీరోల జాబితా విప్పింది. ఆ జాబితా మామూలుది కాదు, చాలా పెద్ద‌ది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబు, సూర్య‌, విక్ర‌మ్‌… ఇలా అన్న‌మాట‌. ఈ లెక్క‌న రెజీనా ఎంత తెలివైన స‌మాధానం ఇచ్చిందో ఊహించుకోవ‌చ్చు.