శ్రీనివాసుడి కల్యాణానికి డేట్ ఫిక్స్ చేసారు ?

Wednesday, April 18th, 2018, 11:32:30 PM IST


యంగ్ హీరో నితిన్ నటించిన రెండు సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్నాయి. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన లై, పవన్ కళ్యాణ్ నిర్మించిన చల్ మోహన్ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు .. దాంతో నితిన్ టెన్షన్ లో పడ్డాడు. కెరీర్ గాడిలో పడిందని అనుకునేలోగా ఇలా రెండు వరుస పరాజయాలు టెన్షన్ పెట్టాయి. అందుకే ఈ సారి అయన ఓ పూర్తీ స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. శ్రీనివాస్ కళ్యాణ్ పేరుతొ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రాన్ని జులై 24న విడుదల చేస్తారట. నితిన్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సక్సెస్ నీతిన్ కు చాలా అవసరం మరి !!

  •  
  •  
  •  
  •  

Comments