చనిపోవద్దమ్మా అంటూ కూతురి ఏడుపు..రేణుదేశాయ్ ఏం చేసిందంటే..!

Sunday, October 15th, 2017, 12:59:18 PM IST

తన అనారోగ్యం చేసినపుడు జరిగిన ఎమోషనల్ సంఘటనని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. కొంత కాలం క్రితం రేణు దేశాయ్ కు తీవ్రమైన జ్వరంతో పాటు ఆర్థో ఇమ్యూన్ కండిషన్ ఏర్పడింది. దీనితో గుండె సమస్య కూడా ఏర్పడింది. ఆ సందర్భంలో తన పిల్లల మధ్య జరిగిన సంఘటనని జీవితంలో మరిచిపోలేనని రేణు తెలిపారు. మాత్రలు వేసుకుని గాఢ నిద్రలోకి వెళ్ళాను. ఆ సమయంలో నా కూతురు ఆద్య స్కూల్ నుంచి వచ్చింది. నన్ను లేపడానికి ప్రయత్నించినా మాత్రల మత్తు కారణంగా త్వరగా లేవడం వీలు పడలేదు. దీనితో ఆద్య ఆందోళన చెందింది.

తాను చనిపోతానేమో అని భయపడి ఏడవడం మొదలుపెట్టింది. నేను నిద్ర లేచేసరికి.. ప్లీజ్ మమ్మి చనిపోవద్దు అంటూ ఏడుస్తూనే ఉంది. తాను కూడా ఏడిస్తే ఆధ్య ఇంకా భయపడుతోందని భావించి భాదని మనసులోనే దాచుకుని ఓదార్చా. నేను చనిపోను.. నీతోనే ఉంటాను ప్రామిస్. నేను చనిపోతానని ఎందుకు భయపడుతున్నావు. నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు.. అని చెప్పి ఓదార్చినట్లు రేణు దేశాయ్ పేర్కొన్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేని సమయంలో అకీరానే తన చెల్లెలిని బాగా చూసుకున్నాడని రేణు తెలిపారు.