నా పెళ్లికి మిమ్మల్ని తప్పకుండా పిలుస్తా : రేణు దేశాయ్

Thursday, October 19th, 2017, 02:23:33 PM IST

నటిగా నిర్మాతగా అలాగే దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్ ఎవరో అందరికి తెలిసిన విషయమే.. పవన్ కళ్యాణ్ ను వివాహమాడిన తర్వాత కొన్నేళ్ల వరకు బాగానే ఉన్న ఆమె అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకొని పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో కలిసి పూణే లో నివసిస్తున్నారు. అయితే ఆమె ఈ మధ్యన బుల్లి తెరపై ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న డ్యాన్స్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో ఆమె మరోసారి తన పెళ్లి గురించి ప్రస్తావించారు. షోలో ఒక జంట డ్యాన్స్ పర్ఫామెన్స్ ను చూసిన రేణు దేశాయ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వారిని పొగుడుతూ ప్రేమను గుర్తు చేశారని చెప్పింది. అంతే కాకుండా భవిష్యత్తులో మరో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని పిలుస్తా’ అంటూ కంటిస్టెంట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం ఆ షో యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments