పవన్ ఫ్యాన్స్‌కు, నాకు గొడవపెట్టకండి.. రేణు దేశాయ్ రిక్వెస్ట్..!

Friday, February 14th, 2020, 11:06:36 PM IST

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇల్లు కానుకగా ఇచ్చాండంటూ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రచారాన్ని తప్పు పట్టింది.

అయితే పవన్ కళ్యాణ్ నుంచి తనకు ఎటువంటి కానుకలు అందలేదని హైదరాబాద్‌లో కొన్న ఇల్లు నా కష్టార్జితం అని తెలిపింది. అయితే ఏ మగాడి సాయం లేకుండా ఒంటరిగా సాగుతున్న ఒంటరి తల్లి జీవనానికి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసి కించపరచకండని పవన్ కళ్యాణ్ అభిమానులకు, నాకు మధ్య లేనిపోని గొడవలు పెట్టకండని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు.