ఆర్జీవీ తన సినిమా కోసం ఇలా చెప్పేశాడేంటి?

Thursday, December 12th, 2019, 08:55:51 AM IST

రామ్ గోపాల్ వర్మ “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ని తీసుకొని చిత్ర బృందం కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కొత్తగా కళాశాలలో చేరితే సీనియర్ విద్యార్థులు ఎలా ర్యాగింగ్ చేస్తారో, అలానే రాజకీయాలలో కూడా ఉంటుందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే రాజకీయాలలో సీనియర్ నాయకుల్ని ర్యాగింగ్ చేసేలా ఈ చిత్రం ఉండబోతుంది అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అయితే ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఆ సీనియర్ రాజకీయ నాయకులు తమ తెలివి తక్కువ మాటలతో మనల్ని కేకలు వేసినపుడు మనం ఎందుకు వారిని చూసి నవ్వకూడదు అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

అయితే ఈ చిత్ర విడుదల కు చాల సమస్యలు వచ్చాయి. తేరా వెనుక ఈ చిత్రాన్ని అడ్డుకోవడానికి చాల పరిస్థితులు దారితీశాయి. కానీ అవేంటో సినిమా విడుదల అయ్యాక మీకే తెలుస్తుందని షాక్ ఇచ్చాడు వర్మ. అయితే ఈ చిత్రం డిసెంబర్ 12 న అనగా ఈరోజు ప్రేక్షకుల ముందుకి రానుంది.