హాట్ టాపిక్: రామ్ గోపాల్ వర్మ కాన్ఫిడెన్స్ మాములుగా లేదు

Wednesday, December 11th, 2019, 10:42:17 AM IST

రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు అడ్రస్ గా మారిపోయారు. దర్శకత్వంలోకి అడుగుపెట్టిన తోలి నాళ్లలో సంచలన విజయాల్ని అందుకొని భారతదేశం లోని అత్యుత్తమ చిత్రాల్లో తన చిత్రాల్ని నిలుపుకున్న ఘనుడు. అయితే రామ్ గోపాల్ వర్మ నిజ జీవిత పాత్రలతో కల్పిత కథలని చెప్పి సినిమాలు గా చాల తీశారు. అయితే ఇప్పటివరకు తీసిన సినిమాలు రాజకీయ నాయకుల్ని అంతగా ఆందోళనకు గురి చేయలేదు.

అయితే రామ్ గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి చాల సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ చిత్రం టైటిల్ మొదట కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ప్రకటించి దానికి ప్రచార చిత్రాలను, ప్రోమోలను వీడియోలను విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఇది రెండు వర్గాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని కోర్టులే కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ సర్టిఫికెట్ ని కోర్ట్ కోరగా ఇంకా సమర్పించలేదని తెలుస్తుంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ చిత్రాన్ని డిసెంబర్ 12 న విడుదల చేసేందుకు సిద్ధంగా వున్నాడు. ఇన్ని వివాదాలు నడుస్తున్నా, ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ అందించకపోయినా, ఆర్జీవీ మాత్రం ఈ చిత్ర విడుదల ఫై కాన్ఫిడెంట్ గా వున్నారు. మరి ఈ చిత్రం విడుదల అవుతుందో లేదో చూడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.