అమితాబ్ కి కరోనా… కానీ నేను కరోనా కోసం ప్రార్దిస్తా…ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sunday, July 12th, 2020, 10:04:42 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ ఏ ఒక్కరినీ కూడా వదిలి పెట్టడం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య కి కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. అయితే బిగ్ బి కి కరోనా వైరస్ పాజిటివ్ రావడం పట్ల వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. అన్నిటికీ బిన్నంగా స్పందించే రామ్ గోపాల్ వర్మ, ఈ విషయం పై కూడా తన స్టైల్లో స్పందిస్తూ ఒక ఆసక్తి కర ట్వీట్ చేశారు.

అమితాబ్ ను సర్కార్ అని సంబోధిస్తూ, కరోనా వైరస్ బ్యాక్ పై తన్ని ఎప్పటి లాగే మీరు ఆరోగ్యం గా తిరిగి వస్తారు అని నాకు తెలుసు, అందుకే మీ కోసం నేను ప్రార్డించను అని అన్నారు. కానీ కరోనా కోసం ప్రార్డిస్తా అని తెలిపారు. ఎందుకంటే అది మిమ్మల్ని ఇలా చేసినందుకు కచ్చితంగా చనిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. అమితాబ్ పై చేసిన వ్యాఖ్యల కు నెటిజన్లు స్పందిస్తున్నారు. అమితాబ్ తప్పకుండా మళ్లీ తిరిగి ఆరోగ్యంగా వస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.