ఆర్జీవీ ఆఫీస్ పై దాడి…ఫిర్యాదు చేసినట్టే చేసి మళ్లీ వెనక్కి!

Friday, July 24th, 2020, 12:14:37 AM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ స్టార్ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. అయితే తాజాగా పవర్ స్టార్ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన ఆర్జీవీ, తన కార్యాలయానికి పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్ళారు. ఆర్జీవీ తో చర్చించేందుకు వెళ్ళగా అక్కడ లేకపోవడం అభిమానులు కార్యాలయం ను ద్వంసం చేశారు. కార్యాలయానికి ఎవరైనా రావొచ్చు అని, స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్జీవీ.

అయితే ఆర్జీవీ లేకపోవడం తో అభిమానులు ద్వంసం చేయగా ఆర్జీవీ ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసినట్టే చేసి మళ్లీ వెనక్కి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశం పై తెలుగు రాష్ట్రాల్లో చర్చలు మొదలు అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ పై సేటిరికల్ గా తెరకెక్కిస్తున్న ఈ పవర్ స్టార్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఒక్క రోజులోనే భారీగా వ్యూస్ రావడం గమనార్హం.