వ‌ర్మ అన్నంత పని చేయిస్తున్నాడుగా!

Wednesday, February 13th, 2019, 02:32:34 AM IST

రామ్‌గోపాల్ వ‌ర్మ. సంచ‌ల‌నాల‌కు మారుపేరు. సంచ‌ల‌నం కాక‌పోయినా తాను అనుకుంటే అది చిటికెలో సంచ‌ల‌నం అయిపోతుంది. అదీ వ‌ర్మ స్టైల్‌. అలాంటి వ‌ర్మ‌కు వివాదాస్ప‌ద క‌థ దొరికితే ఊరుకుంటాడా ర‌చ్చ చేసేయ‌డు. అలాంటి వ‌ర్మ‌కు `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` ఓ బ్ర‌హ్యాస్త్రంలా దొరికింది. ఇక ఊరుకుంటాడా? విశ్వ‌రూపం చూపించ‌డు. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` సినిమాతో వ‌ర్మ ఇప్పుడు త‌న విశ్వ‌రూపం చూపిస్తున్నాడు. ఇటీవ‌ల గుంటూరు వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వెన్నుపోటు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీన్నే త‌న సినిమా ప్ర‌చార అస్త్రంగా వాడుకున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో ప్ర‌ధాని తన సినిమాకు ప్ర‌చారం చేస్తున్నారంటూ ట్విట్టర్ ద్వారా ప్ర‌చారం చేసుకున్నారు.

అయితే వ‌ర్మ వ్యాఖ్య‌ల‌ను చాలా మంది ఇదో ప్ర‌చార ఎత్తుగ‌డ అంటూ కొట్టి పారేశారు. అయితే అది వ‌ర్మ ప్ర‌చార ఎత్తుగ‌డ కాద‌ని, నిజంగానే ప్ర‌ధాని `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` సినిమాకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోని ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్న వ‌ర్మ ప్ర‌ధాని మోదీతో ల‌క్ష్మీపార్వ‌తి చ‌ర్చిస్తున్న ఆ ఫొటోకు `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` గురించి చ‌ర్చిస్తున్నారంటూ చిన్న ట్యాగ్ లైన్ ఇవ్వ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్ర‌ధాని మోదీతో ల‌క్ష్మీపార్వ‌తి చ‌ర్చిస్తున్న ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

గ‌త కొన్ని నెల‌లుగా చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేస్తున్న ప్ర‌ధాని `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` కు స‌పోర్ట్‌గా నిల‌వ‌డం సినిమాపై దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించేలా వుంద‌ని టాలీవుడ్ సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమా
ట్రైల‌ర్‌ను ఈ నెల 14న, ఈ నెల 22న విడుద‌ల కాబోతున్న `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు`తో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` థీయేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు.