ఆర్జీవీ “బాలల దినోత్సవం” అని ఏ ఫోటో పెట్టారో తెలుసా?

Thursday, November 14th, 2019, 01:05:05 PM IST

వివాదాల రామ్ గోపాల్ వర్మ మరొకసారి తనదైన శైలిలో ఒక ఫోటోని విడుదల చేసారు. నవంబర్ 14 న బాలల దినోత్సవం సందర్భంగా ఒక సంచలమైన ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం లోని ఫోటో ని పోస్ట్ చేసారు. అయితే ఈ ఫొటోలో చంద్రబాబు ఫ్యామిలీ కి సంబంచినటువంటి ఒక ఫోటో ని పెట్టారు. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు చిత్రం లో ఆంధ్ర ప్రదేశ్ కి సంబందించిన రాజకీయ నాయకులను ఈ చిత్రం లో చూపించారు.

జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేఏ పాల్ తదితర పాత్రలను అలానే వుండే వ్యక్తుల తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రం టైటిల్ దగ్గర నుండి అన్ని విషయాల్లో వివాదం వున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆర్జీవీ విడుదల చేసిన ఫోటో లో నారా లోకేష్ పాత్రధారి అతని కొడుకు తో ఆడుకున్నట్లు వుంది. వారి వైపు సీరియస్ గా చంద్రబాబు పాత్రధారి చూస్తున్నట్లుగా వుంది. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ ని మార్చాల్సిందిగా కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికి తెలిసిందే.