ఫాదర్స్ డే రోజున అమృత, మారుతీ రావు ల సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఆర్జీవీ!

Sunday, June 21st, 2020, 08:13:38 PM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరొకసారి సంచలనాత్మక కథకి తెర తీశారు. పెరుమాల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రావు హైదరాబాద్ లో నీ ఒక హోటల్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రణయ్ భార్య అమృత కి కన్న తండ్రి మారుతి రావు. అయితే ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

అయితే మారుతీ రావు చనిపోవడం కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే అమృత, మారుతీ రావు ల పై రామ్ గోపాల్ వర్మ సినిమా తీయనున్నారు. ఈ చిత్రానికి మర్డర్ అనే టైటిల్ ను పెట్టారు. అంతేకాక దీనికి క్యాప్షన్ గా కుటుంబ కథ చిత్రం అని పెట్టారు. అయితే దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓ తండ్రి అమిత ప్రేమ, ఓ తండ్రి తన కుమార్తె కు అమితంగా కలిగే ప్రమాదం, ఈ చిత్రం హృదయాన్ని కదిలించే లా ఉంటుంది అని, ఫాదర్స్ డే రోజున ఈ విషాద తండ్రి కథకు సంబందిచిన చిత్రం పోస్టర్ ను లాంచ్ చేస్తున్న అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది లో ఎన్నో సంచలనాల కి తెరలేపిన వర్మ మరొక సంచలనాత్మక కథ తో ముందుకు రావడం ఇపుడు చర్చంసనీయం అయింది అని చెప్పాలి.