2024 లో నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి అంటున్న ఆర్జీవీ!

Tuesday, July 14th, 2020, 02:36:39 AM IST


రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ చిత్రం ను శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్ లని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు వర్మ. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరొక 3 పోస్టర్ లని విడుదల చేశాడు. ఒకటి టెన్షన్ మోమెంట్ అని, మరొకటీ మండలిస్తున్న మొమెంట్ అని, మరొకటి 2024 లో నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ ను పోలిన వ్యక్తి కి చంద్రబాబు లా ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు.

అయితే ఇప్పటికే పలు సార్లు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లి, మళ్లీ పవన్ జోలికి కానీ, తన అభిమానుల జోలికి కానీ వెళ్ళను అని అంటూనే మరొకసారి ఇలా పవర్ స్టార్ అంటూ 2019 ఎన్నికల అనంతరం అని సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక 2019 లో ఒకే ఒక్క సీటు తో దారుణ పరాజయం పాలయ్యారు. అయితే ఇదే తరహాలో ఉండటం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్జీవీ పై దారుణం కామెంట్స్ చేస్తున్నారు. ఒక పక్క ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అంటూ కొందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.