హాట్ టాపిక్: నాగబాబు వ్యాఖ్యలకు ఆర్జీవీ మద్దతు…గాడ్సే మీద త్వరలో సినిమా!

Tuesday, May 19th, 2020, 11:00:43 PM IST

నటుడు, జన సేన పార్టీ నేత నాగబాబు గాడ్సే నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్నే రేపుతున్నాయి. నెటిజన్లు నాగబాబు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాడ్సే నిజమైన దేశ భక్తుడు అని, అపక్యాతి పాలు అవుతాను అని తెలిసినా తాను అనుకున్నది చేశాడు అని,ఆయన దేశ భక్తిని సంకించలేం అని వ్యాఖ్యానించారు. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యలకు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు.

నాగబాబు చెప్పింది వంద శాతం నిజమే అని రామ్ గోపాల్ వర్మ అతనికి మద్దతు తెలిపారు.గాడ్సే కొరుకున్నవి రెండూ నెరవేరినా, గాంధీ నీ ఎందుకు చంపాడు అనే దానికి సమాధానం ఎవరికి తెలీదు అని అన్నారు.అయితే గాడ్సే పై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు అని, అతని జీవితం లో ఎన్నడూ గన్ కూడా పట్టుకోలేదు అని రామ్ గోపాల్ వర్మ గాడ్సే పై వ్యాఖ్యలు చేశారు.

అయితే రామ్ గోపాల్ వర్మ తన సినిమాల పై వస్తున్న పుకార్లు పై న స్పందించారు. తన సినిమాల్లో శృంగారం అనేది ఉంటుంది అని తేల్చి చెప్పారు. అంతేకాక ఈ లాక్ డౌన్ కారణంగా తన వర్క్ ఏమి ఆగిపోలేదు అని వ్యాఖ్యానించారు.తన పై వస్తున్న పుకార్లు అన్ని కూడా నిజమే అని అన్నారు. దేవుడ్ని మనం మర్చిపోకుండా, దేవుడే కరోనా తెచ్చాడు అంటూ వ్యాఖ్యానించారు.