ప్రేమికుల రోజు వారి ఫై ట్వీట్ చేసిన ఆర్జీవీ!

Friday, February 14th, 2020, 10:44:17 PM IST

రామ్ గోపాల్ వర్మ మరొకసారి సంచలనం రేపే ట్వీట్ ఒకటి వేశాడు. హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ ఒక ఫోటో ని పోస్ట్ చేసిన ఆర్జీవీ, ఆ తదుపరి పోస్ట్ లో విజయ్ దేవరకొండ, ఛార్మి, పూరి జగన్నాధ్ ఉన్నటువంటి ఫోటో ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు. వెనుక మాత్రమే కాదు, ప్రతి మగాడి విజయం ముందు ఒక ఆడది ఉంటుంది అన్నట్లు తెలియజేసాడు.అయితే ఆ ఫోటో లో పూరి జగన్నాధ్, ఛార్మి ల గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు తెలియజేస్తున్నారు.

అయితే పూరి జగన్నాధ్ పూరి టాకీస్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. నిర్మాతగా మరి తన కొడుకు సినిమాని సైతం నిర్మిస్తున్నాడు. అయితే పూరి జగన్నాధ్ గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సంగతి అందరికి తెల్సిందే. ఆ చిత్రానికి కూడా ఛార్మి, పూరి జగన్నాధ్ కలిసి పని చేయడం గమనార్హం. మరి ప్రేమికుల రోజున ఆర్జీవీ ఈ ఫోటో ని ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.