శశికలే పెద్ద డాన్ అంటూన్న.. వర్మ ?

Friday, February 17th, 2017, 06:27:07 PM IST


సంచలన దర్శకుడు వర్మ మరోసారి మరో వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ వార్తల్లో నిలిచాడు. ఈ సారి అయన ఫోకస్ తమిళనాడు రాజకీయాలపై పడింది. జయ మృతి తరువాత రాజకీయ పరిస్థితులు తారుమారైన నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి కావడానికి గట్టి ప్రయత్నాలే చేసింది, కానీ ఆమె పై ఉన్న కేసుల నేపథ్యంలో కోర్టు అరెస్ట్ చేయడం వంటి విషయాలను గమనించిన వర్మ .. ఈ సారి శశికళ పేరుతొ ఓ సినిమా తీస్తానని అంటున్నాడు ? ఇంకా రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని, అమ్మ వారసత్వం కోసం శశికళకు పోరు తప్పదని, త్వరలో జరగబోయే పరిణామాలను ఊహించి ఓ సినిమా చేస్తానని అంటున్నాడు. ఇప్పటికే అయన శశికళ గురించి రీసెర్చ్ కూడా మొదలు పెట్టాడట !! మన్నార్ గుడి మాఫియా తమిళనాడు రాజకీయాలను శాశిస్తుందని వర్మ వెల్లడించారు. జయలలితకు, శశికళపై ఉన్న అనుబంధం ఎలాంటిది ? అసలు శశికళకు రాజకీయాలు తెలుసా ? ఇలాంటి అన్ని అంశాలు ఉంటాయని, శశికళ ను డాన్ అంటూ కామెంట్ చేసిన వర్మ .. జైలులో గ్యాంగ్ లను నడిపేవారు, నేరస్తులు శశికళ కంటే చిన్నవాళ్ళే అని చెప్పడం షాక్ ఇచ్చింది? మరి ఈ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు రేపుతాడో చూడాలి !!