విక్ర‌మ్ స‌ర‌స‌న తెలుగ‌మ్మాయ్!

Thursday, February 16th, 2017, 08:07:16 PM IST


తెలుగు హీరోయిన్ రీతూవ‌ర్మ సుడి తిరిగింది. ఏ తెలుగు హీరోయిన్ కు ద‌క్క‌ని భారీ ఆఫ‌ర్ ఇప్పుడు అమ్మ‌డి ఇంటి త‌ల‌పు త‌ట్టింది. ఈ హిట్ తో అమ్మ‌డి లైఫ్ ట‌ర్న్ అవ్వొచ్చు. ఇంత‌కీ ఏ సినిమాలో ఆ న‌యా ఛాన్స్? చియాన్ విక్ర‌మ్ క‌థ‌నాయ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ ఓ సినిమా ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ల‌వ్ క‌మ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న‌సినిమాలో మొద‌ట అను ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేశారు.

అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల అమ్మ‌డు ఆ ఛాన్స్ ను మిస్ చేసుకోవ‌డంతో ఆ ప్లేస్ లో రీతును క‌న్ఫ‌మ్ చేశారు. అయితే రీతును గౌత‌మ్ ఎంపిక చేయ‌డానిక ఓ బ‌ల‌మైన కార‌ణం క‌నిపిస్తుంది. రీతు న‌టించిన `పెళ్లి చూపులు` చిత్రాన్ని త‌మిళ్ లో గౌత‌మ్ మీన‌న్ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో అమ్మ‌డి పెర్పామెన్స్ న‌చ్చ‌డంతోనే రీతును ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.