“రౌద్రం రణం రుధిరం” మోషన్ పోస్టర్ టాక్.!ఇందులోనే ట్విస్ట్ పెట్టిన రాజమౌళి!

Wednesday, March 25th, 2020, 12:53:36 PM IST

ఒక్క మన టాలీవుడ్ నుంచే కాకుండా యావత్తు భారతావళి నుంచే మోస్ట్ ప్రిస్టేజియస్ చిత్రంగా ఎప్పుడో నిలిచినిపోయింది. భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ చిత్రం టైటిల్ కోసమే పెద్ద యుద్ధం ఇన్నాళ్లు జరిగింది కానీ ఇన్నాళ్లకు ఆ టైటిల్ ఏమిటి అన్నది ఈ ఉగాది పర్వదినాన రాజమౌళి బృందం వెల్లడి చేసేసారు.”రౌద్రం రణం రుధిరం” ఈ పేరే ఎంతో పవర్ ఫుల్ గా ఉంది కదా?

అందుకు తగ్గట్టుగానేరాం చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ యుఫొరియా కలిగిన హీరోలను అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఒకేసారి హ్యాండిల్ చెయ్యడం అంత సులువైన పని మాత్రం కాదు. కానీ రాజమౌళి అత్యద్భుతంగా తీర్చిదిద్ది చూపించారు. అయితే రాజమౌళి మాత్రం ఈ టైటిల్ లోనే ఊహించని ట్విస్ట్ పెట్టారు.

దీనికి ముందు ఈ టైటిల్ ఇదే అంటూ దీనికి దగ్గరగా ఉన్న “రామ రావణ రౌద్రం” అనే టైటిల్ ఖరారు చేసారని గట్టిగానే బజ్ వినిపించింది కానీ దానికి దగ్గరగా ఉంటూనే అందనంత దూరపు టైటిల్ ఫిక్స్ చేసి రాజమౌళి ట్విస్ట్ ఇచ్చారు.ఇక రామ్ చరణ్ మరియు తారక్ ల తాలూకా జస్ట్ మోషన్ ఫిక్షనల్ ఫొటోలతో ఒకరు నిప్పుల నుంచి మరొకరు నీటి నుంచి వస్తున్న వీరిద్దరి ప్రతిమలు సామాన్య జనంకే వెంట్రుకలు నిక్కపొడుచుకునేలా చేస్తే ఇక వారి అభిమానులకు ఏ రేంజ్ లో ఉంటుంది.

అలాగే ఇపుడు కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగినప్పటికీ అనుకున్న సమయానికే రాజమౌళి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తాం అని విడుదల తేదీని కూడా మరోసారి ఖరారు చేసేసారు. అల;ఆగే ఇందులో ముఖ్యంగా ఈ విజువల్స్ కు తగ్గట్టుగా కీరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనన్య సామాన్యం.ఇక చివరగా ఒక మాట.. “ఈ రౌద్ర రణ రుధిరం చూసేందుకు అంతా రెడీ.. ”