లేటెస్ట్ అప్డేట్: ఆ సీన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ లు ఎలా ఉంటారో తెలుసా?

Wednesday, February 12th, 2020, 09:03:17 AM IST

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీం గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం చాల ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నటించిన జూనియర్ రమణా రెడ్డి, ఒక సన్నివేశంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎలా ఉంటారో వివరించాడు.

రామ్ చరణ్ బ్రిటిష్ డ్రెస్ గెటప్ లో, ఎన్టీఆర్ కుర్తా పైజామా లో ఉంటారని తెలిపారు. అయితే అల్లూరి సీతారామరాజు ఫ్లాష్ బ్యాక్ లేదా బ్రిటిష్ వారి దగ్గర పని చేస్తుండొచ్చు అని తెలిపారు. అయితే తాను చేసిన ఆ సీన్ లో బ్రిటిష్ వద్ద పని చేసే ఎంప్లొయ్ గా రామ్ చరణ్ ఉన్నట్లు తెలిపారు. ఈ సన్నివేశాన్ని బట్టి కథలో ఫ్లాష్ బ్యాక్ ఉండే అవకాశం ఉందని అతను తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల కి సిద్ధంగా ఉంది. ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ తారలతో పాటుగా పలువురు హాలీవుడ్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.