రికార్డు స్థాయిలో RRR ప్రీ రిలీజ్ బిజినెస్..?

Sunday, November 18th, 2018, 07:05:25 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా బాహుబలి చిత్రంతో ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టి అంతటిని తన వైపు తిప్పుకున్న సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకునిగా తెరకెక్కబోతున్న తాజా చిత్రం RRR.ఇద్దరు ఫుల్ మాస్ హీరోలు ఒక సంచలన దర్శకుడు కలిస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుంది.?ఇప్పుడు వీరి కాంబినేషన్ మీద ఆ స్థాయి అంచనాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఈ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.రాజమౌళి మార్కెట్ ఎలాగో ఇప్పుడు ఖండాంతరాలు దాటింది కాబట్టి ముఖ్య భాషలు అన్నిటిలోను విడుదల చేస్తారు.అలా అన్ని భాషల్లోనూ మరియు శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి దాదాపు 500 కోట్లు ప్రీ రిలీజ్ జరుగుతుంది అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా నిలుస్తుంది.