RRR అప్డేట్ : పులితో ఫైట్ చేస్తున్న ఎన్టీఆర్ – బయటకొచ్చిన వీడియో…?

Saturday, January 25th, 2020, 09:28:28 AM IST

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో రాతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR… ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయిందని సమాచారం… ఇక అసలు విషయానికొస్తే… దర్శకుడు రాజమౌళి ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాడు. కాగా ఇప్పటికి వికారాబాద్ అడవి ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతుంది… ఈ సన్నివేశాల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా పాల్గొంటున్నాడు.

ఇకపోతే ఈ చిత్రానికి కూడా లీకుల బాధలు తప్పడం లేదనే చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకి సంబందించిన కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అవడంతో అప్రమత్తమైన చిత్ర బృందం, చిత్రీకరణ జరుగుతున్నా ప్రాంతంలో పటిష్టమైన భద్రతను తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా చిత్రీకరణకు సంబందించిన కొన్ని బయటకొస్తూనే ఉన్నాయి… తాజాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన ఫైట్ సీన్ కి సంబందించిన ఓక వీడియో బయటకొచ్చింది. ఎన్టీఆర్, ఒక పులితో హోరా హోరీగా తలపడే ఆ సన్నివేశం ఈ సినిమాలోనే అత్యంత కీలకమైనదిగ సమాచారం. అయితే విషయం తెలుసుకున్న చిత్ర బృందం తక్షణమే స్పందిస్తూ… కాపీ రైట్ ఇష్యూ కింద ఆ వీడియోను ఆన్ లైన్ నుండి తొలగించారు.