RRR విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం..ఇదేమి విడ్డురం

Wednesday, September 18th, 2019, 06:57:37 PM IST

2020 ఇండియాలో మోస్ట్ అవెటింగ్ మూవీ ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా RRR అనే చెప్పాలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. చరణ్ సైరా సినిమా బిజీలో ఉండటంతో ఎక్కువగా ఎన్టీఆర్ మీద సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఎన్టీఆర్ తో పులి ఫైట్ ని షూట్ చేశారు. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఇదే ఫైట్ తో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ మీద ఒకటి, రామ్ చరణ్ మీద ఒకటి, ఇద్దరికీ కలిపి మరో పాట ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. సినిమాలోని కథకి ఆ మూడు పాటలే సరిపోతాయని అనిపించటంతో మూడు పాటలే ఫైనల్ చేశారని తెలుస్తుంది. ప్రధానంగా స్టోరీ మీదే రాజమౌళి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఇక మరో విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. అదేమిటంటే ఈ సినిమా నిడివి రెండున్నర గంటలకంటే తక్కువే ఉంటుందని తెలుస్తుంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటే దాదాపు మూడు గంటలకి దగ్గరగా ఉంటాయి, కానీ ఈ సినిమా మాత్రం రెండున్నర గంటలకే ఫిక్స్ చేయాలనీ రాజమౌళి అనుకుంటున్నట్లు తెలుస్తుంది. పాటలు ఎలాగూ మూడే కాబట్టి 15 నిమిషాలు స్టోరీ చెప్పటానికి అదనంగా దొరుకుతుంది. ఆ లెక్కన చూసుకునే సినిమా ఫైనల్ రన్ టైం రెండున్నర గంటలోపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.