RRR నుంచి రిపబ్లిక్ డేకు సర్‌ప్రైజ్ ఉండబోతుందా?

Tuesday, January 19th, 2021, 11:13:38 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం అయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా కర చాలనం చేస్తూ ఉన్న ఫోటోను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే నేడు క్లైమాక్స్ పోస్టర్‌తో అభిమానులను అలరించిన RRR చిత్ర యూనిట్ త్వరలోనే మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. రిపబ్లిక్ డే కానుకగా మూవీ నుంచి పోస్టర్ లేదా ఏదైనా గ్లింప్స్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.