ఎన్టీఆర్ అభిమానులకు నిరాశే…వెయిట్ చెయ్యండి పండుగ చేసుకుందాం అంటున్న చిత్ర యూనిట్!

Monday, May 18th, 2020, 03:26:55 PM IST


దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి మొట్టమొదటి సారిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఒక్క హీరో ఉంటేనే పతాక స్థాయిలో సన్నివేశాలు ఉంటాయి. అలాంటిది ఇద్దరు టాప్ హీరోలతో రాజమౌళి సాహసం చేస్తున్నారు అని చెప్పాలి.

అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే భీమ్ ఫర్ రామరాజు తో చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన వీడియో గూస్ బంప్స్ తీసుకొచ్చింది. అయితే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామ్ చరణ్ కి పుట్టిన రోజు బహుమతి ఇచ్చారు జక్కన్న. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే మే 20 న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వీడియో లేదా ఫస్ట్ లుక్ ఉంటుంది అని అభిమానులు భావించారు. అయితే అలాంటిది ఏమి లేదు అని RRR చిత్ర యూనిట్ తేల్చి చెప్పింది.

అయితే లాక్ డౌన్ పొడిగింపు ఎక్కువ రోజులు ఉండటం కారణంగా చిత్రానికి సంబంధించిన పనులు ఆగిపోయాయి అని వ్యాఖ్యానించారు.తాము ఎంతగా ప్రయత్నించినా ఎన్టీఆర్ పుట్టిన రోజు కి ఎలాంటి వీడియో విడుదల చేయలేక పోతున్నాం అని అన్నారు.అయితే ఎన్టీఆర్ వీడియో కోసం వేచి ఉండటం కూడా విలువైనదే అంటూ చిత్రం యూనిట్ ప్రామిస్ చేసింది. అయితే అది విడుదల అయినపుడు మన అందరికీ అతి పెద్ద పండుగ అవుతుంది అని నిర్ధారించుకోండి అని వ్యాఖ్యానించారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖుల నుండి, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 8 న విడుదల చేసేందుకు చిత్ర షూటింగ్ సన్నాహాలు చేస్తుంది.