ఎన్టీఆర్ పుట్టిన రోజుకి “ఆర్ఆర్ఆర్” టీమ్ సర్ప్రైజ్!

Wednesday, May 19th, 2021, 05:00:02 PM IST

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రౌద్రం రణం రుధిరం చిత్ర యూనిట్ ఒక సర్ప్రైజ్ ను సిద్దం చేసింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తుంది. అయితే ఈ నేపథ్యం లో అభిమానులకు ఎన్టీఆర్ ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. ఎలాంటి వేడుకలు జరపవద్దు అని తెలిపారు. అంతా కూడా ఇళ్ళ వద్ద జాగ్రత్తగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు ఎన్టీఆర్. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. రాజమౌలి దర్శకత్వం లో సినిమా అంటేనే ఎన్టీఆర్ ను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రేపు ఒక వీడియో లేదా పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే అభిమానులు అంతా కూడా ఇళ్ళల్లో నే ఉండాలని, బయటికి రావొద్దు అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో మరొక యోధుడు గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తుండగా, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.