రాశిఖ‌న్నా అత‌డిని మ‌రిచిపోవ‌ట్లేదు

Tuesday, September 20th, 2016, 10:15:12 AM IST

rashikhanna
అప్పుడెప్పుడో క‌లిసి సినిమా చేశారు. ఆ త‌ర్వాత ఆ హీరో బోలెడ‌న్ని సినిమాలు చేశాడు. రాశిఖ‌న్నా కూడా ఎంతోమంది హీరోల‌తో జ‌త‌క‌ట్టింది. కానీ ఆమె మాత్రం అప్పుడెప్పుడో క‌లిసి సినిమా చేసిన ఆ హీరోని ప‌దే ప‌దే గుర్తు చేసుకొంటోంది. అంటే ఏంట‌ర్థం? అత‌న్ని మ‌రిచిపోలేకపోతుంద‌నే క‌దా? వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏదో స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ ఉన్న‌ట్టే క‌దా? ఆ మాట‌కొస్తే ఉంద‌ని కూడా ప్ర‌చార‌మైంది. కానీ వాళ్లిద్ద‌రూ ఆ ప్ర‌చారాన్ని తోసిపుచ్చారు. అయితే ఎన్ని రూమ‌ర్లొచ్చినా స‌రే రాశిఖ‌న్నా మాత్రం ఆ హీరోని గుర్తు చేసుకోవ‌డం, ఆ హీరో గురించి మాట్లాడ్డం ఆప‌డం లేదు. ఆ హీరో ఎవ‌రో ఈపాటికే అర్థ‌మ‌య్యే ఉంటుంది. రాశిఖ‌న్నా తొలి తెలుగు సినిమా `ఊహ‌లు గుస‌గుస‌లాడే` హీరో నాగ‌శౌర్య‌నే. క‌థానాయిక‌ల మాటలు ఎక్కువ‌గా ఆ క్ష‌ణంలో క‌లిసి ప‌నిచేస్తున్న క‌థానాయకుల చుట్టూనే
తిరుగుతుంటాయి. కానీ రాశిఖ‌న్నా మాత్రం హీరోల ప్ర‌స్తావ‌న వ‌స్తే నాగ‌శౌర్య గురించి మాట్లాడ‌కుండా మాత్రం వ‌దిలిపెట్ట‌దు. నా తొలి తెలుగు సినిమా హీరో సెట్లో అలా ఆట ప‌ట్టించేవాడు, ఇలా ఆట‌ప‌ట్టించేవాడు అని మాట్లాడుతుంటుంది. ఈమ‌ధ్య మ‌ళ్లీ `ఊహ‌లు గుస‌గుస‌లాడే` రోజుల్ని గుర్తు చేసుకొంటూ “నాగ‌శౌర్య న‌న్ను ఫ్రీ రేడియో అంటూ ఆట‌ప‌ట్టించేవాడు. నాకు ఒక్క‌సారి ఎవ‌రైనా ప‌రిచ‌య‌మైతే చాలు ఎక్కువ‌గా మాట్లాడేస్తుంటా. ఆ అల‌వాటు ఎప్ప‌టికీ మాన‌లేనేమో“ అని చెప్పుకొచ్చింది రాశిఖ‌న్నా. నాగ‌శౌర్య‌నే ఎక్కువ‌గా గుర్తు చేసుకొంటుంటారేంటి? అని ఆమెని అడిగితే.. “మా ఇద్ద‌రి ఏజ్ గ్రూపులు ఒక్క‌టే. సో మామ‌ధ్య ఫ్రెండ్‌షిప్ అలా ఉంటుంది. అందులో మీకేం స‌మ‌స్య‌?“ అంటూ న‌వ్వేస్తుంది ఈ భామ‌.