సాహో… ఎక్కడా తగ్గనంటున్న ప్రభాస్.. మరో స్థాయికి తెలుగు సినిమా

Tuesday, September 17th, 2019, 06:13:23 PM IST

తెలుగు సినిమా ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన హీరో అంటే ఒక్క ప్రభాస్ అనే చెప్పాలి. సాహో చిత్రం తన వసూళ్ళ పరంపరని కొనసాగిస్తూనే వుంది. బాలీవుడ్ లో ఇప్పటివరకు 153 కోట్ల కలెక్షన్లతో సాహో దూసుకుపోతుంది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాలీవుడ్ లో ఇంకా తన జోరు ని కొనసాగిస్తూనే వుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా ఆగష్టు 30 న థియేటర్ల లోకి వచ్చింది.

ఒక సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఇంత కలెక్షన్స్ రాబట్టడం పట్ల పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర బృందం, ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా తమ హీరో ప్రభాస్ వలెనే ఇదంతా సాధ్యం అయిందని అంటున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తీసి ఒక సినిమా దర్శకత్వం వహించి అంతర్జాతీయ సినిమా తీసిన ఘనత ఒక్క సుజిత్ కె దక్కుతుందని చెప్పాలి. అద్భుతమైన సన్నివేశాలలో టెక్నాలజీ ని 100 పెర్సెంట్ వాడుకున్నాడని కూడా చెప్పొచ్చు. ఈ సాహో సునామి మున్ముందు ఇంకెన్ని కలెక్షన్స్ కొల్లగొడుతుందో వేచి చూడాలి.