సాహో ఫైనల్ బిజినెస్ లిస్ట్ మతిపోయే రేట్లుకి అమ్మేశారు

Monday, August 19th, 2019, 04:11:28 PM IST

దేశం మొత్తం సాహో ఫీవర్ మొదలైంది. నిన్నటికి నిన్న జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసి యావత్తు ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం షాక్ అయ్యింది. నభూతో అనే స్థాయిలో ఈవెంట్ జరిగింది. దాన్ని చూసే అర్ధం చేసుకోవచ్చు సాహో కి ఎంత క్రేజ్ ఉందో, దాదాపు 350 కోట్లు పై చిలుక పెట్టి సినిమాని నిర్మించారు యువి క్రియేషన్స్ వాళ్ళు. మొదట 250 కోట్లు అని అనుకున్నారు, కానీ అది 350 కోట్లకి చేరుకుంది.

దానికి తగ్గట్లే సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. కేవలం తెలుగు రెండు రాష్ట్రాల నుండి థియేట్రికల్ రైట్స్ ద్వారా 125 కోట్లు వచ్చాయి. అలాగే హిందీ రైట్స్ 100 కోట్లకి పలికాయి, అలాగే హిందీ శాటిలైట్స్, డిజిటల్ రైట్స్ 85 కోట్లుకి ఫైనల్ అయ్యింది. ఇక తెలుగు,తమిళ్ సాటిలైట్, డిజిటల్ రైట్స్ కి దాదాపు 110 కోట్లు రేట్ చెపుతున్నారు యువి క్రియేషన్స్, రేపో మాపో అది ఫైనల్ కావచ్చు. కర్ణాటక నుండి 27 కోట్లు, తమిళనాడు నాడు 25 కోట్లు, కేరళ నుండి 6 కోట్లు దాక వచ్చాయి. అంటే కాకుండా ఓవర్శిస్ ద్వారా 65 కోట్లు వచ్చాయి.