“సాహో” విషయంలో అస్సలు కంప్రమైజ్ అయ్యేది లేదు.!

Friday, July 19th, 2019, 09:45:24 AM IST

ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా యావత్తు భారత ప్రేక్షకులు కూడా “సాహో” చిత్రం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే.ముందుగా ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగష్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ చెప్తూ ఇదే విషయాన్ని టీజర్లు మరియు పోస్టర్ల ద్వారా పలు మార్లు ఖరారు చేసారు.కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని వార్తలు జోరందుకోగా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఒకరకమైన గందరగోళం నెలకొంది.దీనితో మేకర్స్ నుంచి ఒక అధికార ప్రకటన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో సినిమా కోసం ఒక అప్డేట్ ను అధికారికంగా సాహో బృందం వదిలారు.

ఇన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల కాబోతుందని అధికారిక ప్రకటన చేసారు.దీనికి కారణం కూడా వారు తెలియజేసారు.” భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు ఇదివరకు ఎన్నడూ ఇండియన్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.కానీ ఇప్పటి వరకు వచ్చిన అవుట్ ఫుట్ సాహో యూనిట్ కు అంతగా నచ్చలేదు.

ఎక్కువగా యాక్షన్ టాకీ ఉండడం వల్ల అధిక నాణ్యతతో సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచడానికే సినిమాను వాయిదా వేసాం,ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు,తమిళ్ మరియు హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నామని ఈ అప్డేట్ ద్వారా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులు కాస్త కుదుట పడతారని భావిస్తున్నామని” తెలియజేసారు.300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు ఆగష్టు 30 వరకు ఆగాల్సిందే మరి.