“సాహో” సెకండ్ సింగిల్ పై పవర్ స్టార్ ఎఫెక్ట్.!

Tuesday, July 23rd, 2019, 05:38:45 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో ఇద్దరూ ఇద్దరే..అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండగా ప్రభాస్ మాత్రం తన సినిమాల్లోనే నిమగ్నం అయ్యి ఉన్నారు.అయితే ఈ ఇద్దరికీ ఏ స్థాయిలో అభిమాన జనం ఉన్నారో అందరికి తెలిసిందే.అలాగే ఈ ఇద్దరినీ కలిపి ఇష్టపడే మ్యుట్యుయల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉంటారు.ఇప్పుడు అలంటి అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సాహో చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమా నుంచి “సైకో సైయాన్” అనే ఫస్ట్ సింగిల్ ఒకటి విడుదల అయిన సంగతి కూడా అందరికి తెలిసిందే.ఇప్పుడు సెకండ్ సింగిల్ కు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.సాహో సెకండ్ సింగిల్ “ఏ చోట నువ్వున్నా” అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఈ లిరిక్ వినగానే ఖచ్చితంగా పవన్ నటించిన “జానీ” సినిమాలో ఉన్న “ఏ చోట నువ్వున్నా” గుర్తు రాక మానదు.దీనితో ఈ పాట కూడా అలాగే ఉందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.అయితే జానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర విఫలం అయినా సరే రమణ గోగుల అందించిన సంగీతం మాత్రం నిరాశ పరచలేదు.దానితో ఈ పాట కూడా అదే మెలోడియస్ గా ఉంటుందేమో అని అభిమానులు ఆశాజనకంగా ఎదురు చూస్తున్నారు.