“సాహో” ఈ రూమర్లను అధిగమించాల్సిందే.!

Friday, June 14th, 2019, 11:33:27 PM IST

ఒకే ఒక్క టీజర్ తో “సాహో” అప్పటివరకు ఉన్న అంచనాలు ఒకెత్తు ఆ తర్వాత నుంచి ఏర్పడిన అంచనాలు ఒకెత్తు అని చెప్పాలి.ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు భాషల్లోనూ కలిపి 24 గంటల్లో ఎన్నెన్నో రికార్డులను ఈ ఒక్క టీజర్ నెలకొల్పింది.దీనితో సాహో పై అంచనాలు డబుల్,ట్రిపుల్ అయ్యాయి.కానీ ఎక్కడో చిన్న సందేహం ఎంత పెద్ద సినిమా అయినా సరే స్క్రీన్ ప్లే మరియు కథ ప్రేక్షకుడిని మెప్పించలేకపోతే వారు ఎన్నేళ్లు కష్టపడి తీసిన సినిమా అయినా సరే వృధాగా మిగిలిపోతుంది.

ఈ భారం అంతా ఇప్పుడు సుజీత్ పైనే ఉంది అని చెప్పాలి.ఎందుకంటే కేవలం సుజీత్ తన రెండో సినిమాతోనే 300 కోట్ల భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.అలాంటిది ఈ సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇప్పుడేమో టీజర్ విడుదలయ్యాక ఫుల్ ఆన్ యాక్షన్ కనబడుతున్నా సరే మొదటి 5 సెకన్లు ఫ్రేమ్స్ చూస్తే ఏమాత్రం విజువల్ ఎఫెక్ట్స్ మెప్పించలేదు.దానితో ఈ సినిమా ఒక వీడియో గేమ్ కాన్సెప్ట్ మీద తెరకెక్కుతోందని కథ కూడా అలాగే ఉంటుందని రకరకాల రూమర్లు ఇప్పుడు నడుస్తున్నాయి.

నిజంగానే స్క్రిప్ట్ కనుక అలాగే ఉంటే అది తీవ్రమైన నిరాశే అని చెప్పాలి.ఇంత పెద్ద యాక్షన్ థ్రిల్లర్ ను కేవలం అలాంటి కాన్సెప్టుకు మాత్రమే పరిమితం చెయ్యడం సరికాదు.అంటే అంతకు మించి ఏదో ప్రత్యేకత ఖచ్చితంగా ఈ చిత్రంలో ఉండి తీరాలి.ఆ మధ్య ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ టైప్ లో ఉంటుందన్న వార్త కూడా వినిపించింది.ఇలాంటి సినిమాకు అలాంటి కాన్సెప్ట్ ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది.అందువల్ల బాక్సాఫీస్ దగ్గర “సాహో” బ్లాక్ బస్టర్ గా నిలవాలి అంటే అంతకు మించి సినిమాలో ఏదైనా ప్రత్యేకత ఉండి తీరాలి.