టీజర్ రివ్యూ : సాహో


బాహుబలితో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ నుండి వస్తున్నా సరికొత్త సినిమా సాహో. యావత్తు ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్నా సాహో టీజర్ కొద్దీ నిమిషాల క్రితమే విడుదల అయ్యింది. 1 నిమిషం 39 సెకన్లు నిడివి కలిగిన ఈ టీజర్ ఎలా ఉందో ఒక్క సారి చూద్దాం.

విశ్లేషణ :

టీజర్ స్టార్ట్ అయినా మొదటిలో ఒక డైలాగ్, చివరిలో మరో డైలాగ్ మినహా మిగిలిన టీజర్ మొత్తం పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతోనే నింపేశారు. అసలు మొదటి షాట్ లోనే సాహో సినిమా యొక్క భారీతనం మనకి కనిపిస్తుంది. ఇక ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా ఉంది. ఎక్కడా కూడా హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తీసిపోని విధంగా సాహో టీజర్ ని కట్ చేయటం జరిగింది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి లో హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ మనం టీజర్ లో చూడవచ్చు. విజువల్ గ్రాండియర్ గా టీజర్ ఉంటుంది. ఇందులో హీరోయిన్ శ్రద్ద కపూర్ పాత్ర కూడా చాలా కీలకమైనదని తెలుస్తుంది. ఇక ప్రభాస్ లుక్స్ మాత్రం చాలా అల్ట్రా స్టైలిష్ గా ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ చివరిలో భారీ శరీరం కలిగిన విలన్ పరిగెత్తుకుని వస్తుంటే, ప్రభాస్ ఎదురుగా నడుస్తూ ఒక్క సారి తన బాడీ తో చిన్న ఝలక్ ఇస్తాడు. ఆ ఒక్క సీన్ టీజర్ మొత్తానికే హైలైట్ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

యాక్షన్ సన్నివేశాలు

భారీతనం

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ లేనట్లు అనిపించటం
ఓవర్ గా అనిపించే యాక్షన్ సీన్స్
భారీతనం తప్పితే,బాధ్యతగా అనిపించే ఒక్క సన్నివేశం కూడా లేకపోవటం

తీర్పు :

ఎన్నో అంచనాలు మధ్య విడుదలైన టీజర్ అనుకున్న స్థాయిని అయితే చేరుకుందనే చెప్పవచ్చు. ముందు నుండి యాక్షన్ మూవీ అన్నట్లు ఎక్సపోజ్ చేశారు కాబట్టి, టీజర్ కూడా అలాగే కట్ చేశారు. ఒక విజువల్ ట్రీట్ కి మనల్ని సిద్ధంగా ఉండమని మేకర్స్ ఈ టీజర్ తో చెప్పారు.. అయితే కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే చూపిస్తే చాలు అహో,ఓహో అనేస్తారు అనే భ్రమలో ఉండి ఈ టీజర్ కట్ చేశారని అనిపిస్తుంది. ఇలాంటి టీజర్స్ చూసి బాలీవుడ్,హాలీవుడ్ లో జనాలు సినిమా కోసం ఎగబడే అవకాశం ఉంది కానీ, మన తెలుగులో మాత్రం వీటికి తోడు బలమైన కథ కూడా ఉండాలి. దానిని టీజర్ లో ఎక్కడ కూడా చూపించలేదు.. కాకపోతే టీజర్ లోనే మనం వాటిని ఆశించటం కూడా కరెక్ట్ కాదు, సో ట్రైలర్ వస్తే కానీ సినిమాలోని విషయం ఏమిటో పూర్తిగా తెలియదు. ప్రస్తుతానికి అయితే టీజర్ తో సాహో మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి.