యూత్ కి కనెక్ట్ అవుతున్న సాయి తేజ్..!

Sunday, May 24th, 2020, 12:08:25 AM IST

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. తన శరీర ఆరంభంలోనే మంచి మాస్ ఇమేజ్ సంపాదించి బాగానే నిలదొక్కున్నాడు. కానీ అదే స్థాయిని మైంటైన్ చెయ్యలేకపోయాడు. తర్వాత చేసిన సినిమాలు అన్ని దాదాపు ప్లాప్ బాటలోనే పడ్డాయి.

మావయ్య పవన్ కళ్యాణ్ కు ఎలా అయితే “జల్సా” పర్వాలేదనిపించే హిట్ వచ్చిందో అలా తనకు రీసెంట్ గా “చిత్రలహరి”తో హిట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్ గా “ప్రతిరోజూ పండగే” చిత్రంతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. దీనితో ఇదే జోరును కొనసాగించాలని సాయి తేజ్ భావిస్తున్నాడు.

అందుకే ఈ మధ్య కాలంలో యూత్ కు కనుక కనెక్ట్ అయితే సగం హిట్ అందుకున్నట్టే. అందుకే సింగిల్ స్టేటస్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”.ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ అయినా సరే యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. దీనితో మంచి హైప్ ఈ చిత్రంపై ఏర్పడింది. అన్ని చక్కగా కుదిరితే ఈ సాయి తేజ్ కెరీర్ లో మరో హిట్ కావడం ఖాయం అని చెప్పాలి.