100 కోట్ల హీరోయిన్ మళ్ళీ స్కూలుకెళుతోంది

Friday, June 24th, 2016, 04:18:24 PM IST


ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సినిమా ‘సైరాట్’. ఈ మారాఠీ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఘనవిజయం సాధించి 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా దేశం మొత్తం తిరుగుతోంది. ప్రతి పరిశ్రమా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడమే. ఈ సినిమా విజయంలో కథతో పాటు అందులో అద్భుత నటన కనబరిచిన హీరో హీరోయిన్లు కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆర్చి పాత్రలో నటించిన హీరోయిన్ ‘రింకూ రాజ్ గురు’ అయితే తన నటనకు అందరి ప్రసంశలూ అందుకుంది.

అంత ఫెమ్ వచ్చినప్పటికీ ఈ నటి మళ్లీ స్కూలు బయటపెట్టింది. సినిమాకి ముందు తన స్వగ్రామం షోలాపూర్ లోని అక్లూజ్ లోని స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈమె ఇప్పుడు కూడా ఆ స్కూల్లోనే 10వ తరగతి పూర్తి చేస్తానని అంటోంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయినప్పటికీ, బోలెడన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ కూడా తన మూలాలలను మర్చిపోకుండా పాత జీవితంలోకి వెళ్లడం నిజనగా అభినందించదగ్గ విషయమే కదా.