ఫోటో టాక్‌ : మ‌రువ‌లేనిది.. మ‌ర‌పులేనిది.. గ‌తం!

Tuesday, March 27th, 2018, 01:04:51 AM IST


ప్రేమ ఎంతో గొప్ప‌ది. ప్రేమికుల‌కు కులం, మ‌తం, భాష, ప్రాంతం ఏదీ ఉండ‌దు. అస‌లు ప్రేమ దోమ ఎప్పుడు ఎక్క‌డ ఎలా కుడుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఒక‌సారి కుట్టాక మాత్రం ఇక దాని మాయ‌లోంచి బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్ట‌మే. కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ త‌న లైఫ్‌లో ప‌లువురు క‌థానాయిక‌ల‌తో సాగించిన ప్రేమాయ‌ణాలు ఆల్వేస్ హాట్ టాపిక్‌. 54 ఏళ్ల వ‌య‌సు ద‌గ్గ‌ర ప‌డినా అత‌డు అస‌లు పెళ్లి చేసుకోకుండా బ్యాచిల‌ర్‌గానే మిగిలిపోవ‌డానికి, అంతూ ద‌రీ లేని ప్రేమాయ‌ణాల‌కు ఏదైనా లింక్ ఉందా?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇదిగో ఈ ఫోటోనే అని చెప్పాలి. పాత గాయ‌న్ని కొత్తగా కెల‌క‌డం అవ‌స‌ర‌మా? అని అనిపించినా ఈ ఫోటో చూశాక ఎవ‌రైనా త‌ప్ప‌ద‌నే అంగీక‌రించాలి. స‌ల్మాన్ – ఐశ్వ‌ర్యారాయ్ జంట అద్భుత ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించారు. ధాయ్ అక్ష‌ర్ ప్రేమ్ కే (2000), హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ (1999), హ‌మ్ తుమ్హారే హై స‌న‌మ్ (2002) … ఇవ‌న్నీ ప్రేమ‌క‌థా చిత్రాల హిస్ట‌రీలో నిలిచిపోయాయి. స‌ల్మాన్ – ఐష్ బెస్ట్ పెయిర్‌గా మెప్పించింది ఈ సినిమాల్లో. ఆ సినిమాల స‌మ‌యంలోనే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ చిగురించడం, అటుపై చాలా కాలం ఆ ప్రేమ‌ను కొన‌సాగించ‌డం తెలిసిందే. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ ఫోటో హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ చిత్రంలోనిది. బాలీవుడ్ టాప్ 100 ప్రేమ‌క‌థా చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకున్న అరుదైన చిత్ర‌మిది. అందుకే ఈ స్టిల్‌ని స‌ల్మాన్ ఫ్యాన్స్ వ‌ర‌ల్డ్ వైడ్ సామాజిక మాధ్య‌మాల్లో అటూ ఇటూ ప్ర‌మోట్ చేస్తూనే ఉన్నారు. రేర్ క‌లెక్ష‌న్ ఇది.