సల్మాన్ “భారత్” ట్విట్టర్ రివ్యూ..!

Wednesday, June 5th, 2019, 03:00:44 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా ఏపాటిదో అందరికీ తెలుసు. అతని యావరేజ్ సినిమాలు అయినా సరే 200 కోట్ల గ్రాస్ ను సునాయాసంగా అందుకునేవి కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలతో మాత్రం సల్మాన్ అంతగా మెప్పించలేకపోయారు.ఈ నేపథ్యంలోనే ఈ రోజు రంజాన్ సందర్భంగా భారీ ఎత్తున తన కొత్త సినిమా అయినటువంటి “భారత్” ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1947 కాలంకు చెందినప్పటి కథగా పోస్టర్లు వీడియోలు చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ సినిమాలో సల్మాన్ 1947 నుంచి 2010 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం చాలా ఆశ్చర్యకరంగాను చాలా బాగుందని సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్లో తెలుపుతున్నారు.అలీ అబ్బాస్ దర్శకత్వం చాలా బాగుందని కామెడి,ఎమోషన్స్ అలాగే కత్రీనా సింపుల్ లుక్ ఇలా అన్ని హంగులు ఈ చిత్రంలో ఉన్నాయని సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూ ఇస్తున్నారు.ఓవరాల్ గా సల్లూ భాయ్ మరో సారి బాక్సాఫీస్ దగ్గర లెక్కలు మార్చడం ఖాయమని అంతా అంటున్నారు.