సమంత జోక్యం – చైతూ కి శాపం..?

Tuesday, November 6th, 2018, 11:05:28 AM IST

ఆక్కినేని నాగ చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా సవ్యసాచి, ఈ సినిమాతో చైతూ గట్టెక్కుతాడు అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అవటంతో చైతూ ఖాతా లోకి హ్యాట్రిక్ ఫ్లాప్ వచ్చి పడింది. ఇదిలా ఉంటే, చైతూతో పెళ్ళైన తరువాత సమంత చైతూ సినిమాల విషయంలో వ్యవహరిస్తున్న తీరే అతనికి శాపం లా మారిందని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. వీటిలో నిజమెంతో తెలీదు గాని, నాగ చైతన్య సినిమాల విషయంలో సమంత కాస్త ఎక్కువగానే జోక్యం చేసుకుంటుంది అంటూ రూమర్లు బాగానే వస్తున్నాయి. మహేష్ బాబు సినిమాల విషయంలో నమ్రత జోక్యం చేసుకున్నట్లు గానే సమంత వ్యవహరిస్తోంది అంటున్నారు.

సమంత కథల ఎంపికతో మొదలు పెట్టి, ఎడిటింగ్ లో సైతం తల దూరుస్తూ తన సలహాలు ఇస్తుందట, ఎంత ప్రయత్నించినా చైతూ కు స్టార్ హీరో రేంజ్ రాకపోవటం తో, తన అనుభవాన్ని అంతా ఉపయోగించి తన కెరీర్ ని గాడిలో పెట్టాలని సమంత తాపత్రయ పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శైలజ రెడ్డి అల్లుడు సినిమా కి ముందు ఈ వార్తలు బాగా వొనిపించాయి, కాకపోతే సమంత జోక్యం వల్లే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అంటున్నారు చాలా మంది. ఇదివరకు నాగచైతన్య సినిమాల విషయంలో నాగార్జున ఒక్కరే ఇన్వాల్వ్ అయ్యేవాడని, ఇప్పుడు సమంత జోక్యం తో సినిమా అంత అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక, నాగ్ కి చూపిస్తున్నారట, అప్పటికే అంత మించిపోవటం తో నాగ్ ఏమి చేయలేకపోతున్నాడట. సమంత చైతూ ని స్టార్ హీరోల రేసులో చూడటం మానేసి, ఒక విభిన్నమైన నటుడిగా మలచటం కోసం తన అనుభవాన్ని ఉపయోగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments