సామ్ పిల్ల‌ల్ని క‌నే డేట్‌?

Monday, April 2nd, 2018, 11:23:24 PM IST

గ‌త అక్టోబ‌ర్‌లో స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడిన సంగ‌తి విదిత‌మే. పెళ్లి త‌ర‌వాత కెరీర్ ప‌రంగా మ‌రింత స్పీడ్ పెంచిన సామ్ పిల్ల‌ల్ని క‌నే ప్లాన్ గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తి చెప్పింది. అస‌లు పిల్ల‌ల్ని క‌నే ఉద్ధేశం ఉందా? లేదా? పిల్ల‌ల్ని కనాల్సిన స‌మ‌య‌మిదేనా? అన్న ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో స్పందించింది సామ్‌.

ఇదివ‌ర‌కూ పెళ్లికి ముందు, అస‌లు పెళ్లి చేసుకునే వ‌య‌సు 30 దాట‌కూడ‌దు అంటూ క్లారిటీనిచ్చింది. ఆ ప్ర‌కార‌మే సామ్ అక్కినేని వారింట కోడ‌లుగా అడుగుపెట్టింది. ఇక తదుప‌రి అంకం పిల్ల‌ల్ని క‌న‌డం. ఇదెప్ప‌టికి ప్లాన్ చేయాలి? అన్న‌దానికి ఏ క్లారిటీ లేద‌నే అర్థం అవుతోంది. సినిమాలు త‌గ్గితేనే తాను పిల్ల‌ల్ని క‌నే ప్లాన్ చేయ‌గ‌ల‌న‌ని అంది. ప్ర‌స్తుత స‌న్నివేశంలో స‌మంత క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. వ‌రుస‌గా ప‌లు క్రేజీ సినిమాల్లో న‌టిస్తోంది. ఇలాంటి వేళ పిల్ల‌ల ప్లాన్ గురించి ప్ర‌శ్నిస్తే త‌ను మాత్రం ఏమ‌ని స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌దు. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చినంత ఈజీ టాస్క్ కాదు ఇది. `రంగ‌స్థ‌లం` స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న సామ్‌, త‌దుప‌రి భ‌ర్త చైతూతో ఓ సినిమా, యూట‌ర్న్ అనే సినిమాలో న‌టించ‌నుంది.

  •  
  •  
  •  
  •  

Comments