ఆ విషయంలో .. సమంత తొందరపెడుతుందట !!

Sunday, February 26th, 2017, 10:40:14 PM IST


టాలీవుడ్ టాప్ గ్లామర్ భామ సమంత వ్యవహారం మరి జోరుగా ఉంది. ఇప్పటికే సినిమాలు తగ్గించుకున్న ఈ అమ్మడు అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి లేటెస్ట్ గా నిశ్చిత్రార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు బాగానే ఉన్న సమంత త్వరలోనే పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉందని ? ఈ విషయం పై చైతూను కూడా తొందర పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి చైతు ఇంకొన్నాలు ఎంజాయ్ చేయాలనీ, కెరీర్ పరంగా మంచి హిట్ సినిమాకోసం చూస్తున్నాడు … కానీ సమంత మాత్రం వచ్చే దసరాలోగా పెళ్లి చేసుకుందామని పట్టు పడుతుందట !! నిజానికి పెళ్లి వచ్చే ఏడాది చేయుకుందామని సమంత నిశ్చితార్దానికి ముందే చెప్పిందని,కానీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించిందని అంటున్నాడు? మరో వైపు అఖిల్ – శ్రియ భూపాల్ ల నిశితార్థం జరిగి ఈ మద్యే అనివార్య కారణాల వల్ల ఆగిపోయినట్టు తెలుస్తోంది.? దానికి కారణాలు ఏమిటనే విషయం మాత్రం బయటికి రావడం లేదు. ఈ విషయం పై నాగ్ కూడా రెస్పొండ్ కావడం లేదుమరి? అఖిల్ వ్యవహారం ఏమైనా కూడా చైతు – సమంతల పెళ్లి మాత్రం త్వరలోనే జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి.